*తాండూరు లో పాఠశాలల బంద్ విజయవంతం

*తాండూరు లో పాఠశాలల బంద్ విజయవంతం – ఏబీవీపీ తాండూరు నగర శాఖ*

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) రాష్ట్ర శాఖ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన పాఠశాలల బంద్ విజయవంతమైందని,
ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ, ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీ నియంత్రణ, విద్యా రంగంలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం ఈ బంద్ నిర్వహించడం జరిగింది అని ఎబివిపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అజయ్ కుమార్ స్పష్టం చేశారు..
ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అజయ్ కుమార్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సమయంలో విద్యకు ప్రాధాన్యత ఇస్తామని ప్రకటించినప్పటికీ, ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలు తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నాయని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పటికీ ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కొరత, ఉపాధ్యాయుల ఖాళీలు, యూనిఫాంలు మరియు పాఠ్యపుస్తకాల పంపిణీలో జాప్యం వంటి సమస్యలు కొనసాగుతున్నాయని అన్నారు.

రాష్ట్రంలోని 27 వేల ప్రభుత్వ పాఠశాలల్లో 23 వేల పాఠశాలలను మూసివేస్తామన్న ప్రకటనను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నిర్ణయం గ్రామీణ, ఆదివాసీ, గిరిజన, దళిత మరియు బలహీన వర్గాల విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

మరోవైపు ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నియంత్రణ చర్యలు తీసుకోవడంలో విఫలమైందన్నారు. ఫీజుల నియంత్రణ చట్టం తీసుకొస్తామని ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని, విద్యాహక్కు చట్టం ప్రకారం పేద విద్యార్థులకు 25 శాతం ఉచిత సీట్ల కేటాయింపును కచ్చితంగా అమలు చేయాలని కోరారు.
**ఎబివిపి ప్రధాన*
*డిమాండ్లు:**
• 27 వేల ప్రభుత్వ పాఠశాలల్లో 23 వేల పాఠశాలలను మూసివేస్తామన్న ప్రకటనను వెంటనే ఉపసంహరించుకోవాలి.
• ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో ఫీజుల దోపిడీని అరికట్టి ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలి.
• విద్యాహక్కు చట్టం ప్రకారం 25 శాతం ఉచిత సీట్ల కేటాయింపును పకడ్బందీగా అమలు చేయాలి.
• ఖాళీగా ఉన్న MEO, DEO, టీచింగ్ మరియు నాన్-టీచింగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి.
• ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించి, యూనిఫాంలు మరియు పాఠ్యపుస్తకాలను వెంటనే అందించాలి.
• గురుకుల పాఠశాలలకు పక్కా భవనాలు నిర్మించి, నాణ్యమైన భోజనం అందించాలి.
• జాతీయ విద్యా విధానం (NEP-2020) అమలు చేయాలి.
• రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని తక్షణమే అమలు చేయాలి.
• ప్రైవేట్ పాఠశాలల ఆధ్వర్యంలో పుస్తకాలు, యూనిఫాంల విక్రయాలను నిషేధించాలి.

ప్రభుత్వం విద్యా రంగ సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో విద్యార్థులతో కలిసి మరింత ఉధృతంగా ఉద్యమాలు చేపడతామని ఏబీవీపీ హెచ్చరించింది. ఈ కార్యక్రమంలో ఎబివిపి ప్రధాన కార్యదర్శి మధుసూదన్ రెడ్డి, నాయకులు మారుతి, జాఫర్, మహేందర్, మహేష్, నారాయణ, గౌతమ్, శ్రీనివాస్, చంద్రకాంత్, శ్రీకర్, శివకుమార్ మరియు తదితరులు పాల్గొనడం జరిగింది..

🗓 23 Jun 2026 | 06:45 PM ✍ Narender Patel journalist https://varahispeednews.in
Share this article: Facebook X Telegram
Scroll to Top