లదాక్‌లోని వుమ్లింగ్ లా శిఖరాన్ని అధిరోహించిన ఎం. వినయ్ కుమార్‌కు వీరశైవ సమాజం ఘన సన్మానం

భద్రేశ్వర స్వామి ఆశీస్సులతో మరిన్ని విజయాలు సాధించాలితాండూరు వీరశైవ సమాజ సర్వసభ్యుడు, స్వామి భద్రేశ్వర దేవస్థాన పూజారి మడపతి విజయకుమార్ కుమారుడు ఎం. వినయ్ కుమార్ భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంలోని లదాక్ సరిహద్దులో ఉన్న ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రహదారులలో ఒకటైన వుమ్లింగ్ లా శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించి అరుదైన ఘనతను సాధించారు.సముద్ర మట్టానికి సుమారు 19,024 అడుగుల ఎత్తులో, మైనస్ ఉష్ణోగ్రతలు, తక్కువ ఆక్సిజన్ వంటి అత్యంత క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటూ ఈ సాహసయాత్రను పూర్తి చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డు స్థాయిలో గుర్తింపు పొందడం తాండూరు ప్రాంతానికే గర్వకారణంగా నిలిచింది.
ఈ విశిష్ట విజయాన్ని పురస్కరించుకుని తాండూరు వీరశైవ సమాజం తరఫున ఎం. వినయ్ కుమార్‌ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సమాజ అధ్యక్షులు కార్యదర్శి ,పెద్దలు, మాట్లాడుతూ.., యువతకు ఆదర్శంగా నిలిచిన వినయ్ కుమార్ భవిష్యత్తులో మరెన్నో జాతీయ, అంతర్జాతీయ స్థాయి రికార్డులు సాధించాలని ఆకాంక్షించారు.
శ్రీ భావిగి భద్రేశ్వర స్వామివారి అనుగ్రహంతో పాటు సమాజ పెద్దల ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ వినయ్ కుమార్‌కు ఉండాలని, ఆయన మరిన్ని శిఖరాలను అధిరోహించి తాండూరు పేరు దేశవ్యాప్తంగా మరింతగా చాటాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సమాజం గౌరవ అధ్యక్షులు గులి పరమేశ్వర్,అధ్యక్షులు తంబాకు చంద్రశేఖర్, ఉపాధ్యక్షులు శెట్టి భాస్కర్, కార్యదర్శి వాలి శ్రవణ్ కుమార్, సహాయ కార్యదర్శి ఆడ్కి శశాంక్, కోశాధికారి కందనెల్లి ప్రకాశం, కార్యవర్గ సభ్యులు గణపురం శంకర్, లింగ దళి రవి కుమార్, అబులం సంపద్, కిరణ్, మద్రికె చందు, బస్వరాజ్ స్వామి, పరమేశ్, ప్రకాశ్ తదితరులు ఉన్నారు.

🗓 23 Jun 2026 | 08:56 PM ✍ Narender Patel journalist https://varahispeednews.in
Share this article: Facebook X Telegram
Scroll to Top