*గ్రామీణ రోడ్లకు మహర్దశ*
*రూ.289 కోట్లతో అభివృద్ధి బాటలో తాండూరు నియోజకవర్గం*
*ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి కృషికి ఫలితం*
*యాలాల కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు మహిపాల్*
*యాలాల..*. తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహరెడ్డి కృషితో తాండూరు నియోజక వర్గంలోని గ్రామీణ రోడ్లకు మహర్దశ కలగనుందని కాంగ్రెస్ యాలాల మండల అధ్యక్షుడు మహిపాల్ అన్నారు. ఆదివారం యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వీరేశం, అగ్గనూరు ఉపసర్పంచ్ వెంకటయ్య, సీనియర్ నాయకులు సుధాకర్ రెడ్డి లతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిపాల్ మాట్లాడుతూ యాలాల మండల పరిధిలోని లక్ష్మీనారాయణ పూర్ నుంచి దేవనూరు, కమాల్ పూర్ నుంచి రాస్నాం వరకు మెరుగైన రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. రోడ్లతో పాటు ఏళ్లుగా ప్రతి వర్షాకాలంలో ఆందోళన కలిగిస్తున్న కోకట్ కాగ్నా బ్రిడ్జి స్థానంలో హై లెవెల్ కొత్త బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు అయ్యాయన్నారు. హ్యామ్ హైబ్రిడ్ యాన్యూనిటీ మోడల్ నిధులతో ఈ పనులు నాణ్యతతో చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు.
వికారాబాద్ జిల్లాకు రూ.520 కోట్ల నిధులు కేటాయించగా, అందులో సింహభాగంగా రూ.289 కోట్ల భారీ నిధులు ఒక్క తాండూరు నియోజకవర్గానికే లభించడం గర్వకారణమన్నారు.
ఈ అభివృద్ధి పనులతో తాండూరు నియోజకవర్గ రవాణా వ్యవస్థ పూర్తిగా మారిపోనుందని, ప్రజల కష్టాలు శాశ్వతంగా తగ్గుతాయని, నిధుల మంజూరుకు ఎంతో కృషి చేసిన ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డికి యాలాల మండల కాంగ్రెస్ పార్టీ తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు.తాండూరు అభివృద్ధికి సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఎమ్మెల్యే కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
రోడ్లకు మహర్దశ*ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి కృషికి ఫలితం*