ఎంకెపల్లి పంచాయతీ కార్యదర్శి మెహన్‌కు ఘన వీడ్కోలు

నూతన కార్యదర్శి శేఖర్‌కు ఆత్మీయ స్వాగతం

ప్రజల మన్ననలు పొందిన ఉద్యోగి బదిలీ బాధాకరం: సర్పంచ్ స్వరూప

ప్రతి ప్రభుత్వ ఉద్యోగి తన విధి నిర్వహణలో భాగంగా బదిలీ కావడం సహజమే అయినప్పటికీ, ప్రజలతో సత్సంబంధాలు ఏర్పరుచుకుని గ్రామాభివృద్ధికి సేవలందించిన ఉద్యోగి బదిలీపై వెళ్లడం బాధాకరమని వికారాబాద్ జిల్లా యాలాల మండలం ఎంకెపల్లి గ్రామ సర్పంచ్ స్వరూప, గ్రామస్తులు పేర్కొన్నారు.ఎంకెపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శిగా పనిచేసిన మెహన్ బదిలీపై ముద్దాయిపేట గ్రామానికి వెళ్లిన సందర్భంగా సోమవారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఘనంగా వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ స్వరూపతో పాటు గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొని మెహన్‌ను శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా సర్పంచ్ స్వరూప మాట్లాడుతూ, మెహన్ గ్రామ ప్రజలతో ఆత్మీయంగా మెలుగుతూ బాధ్యతాయుతంగా విధులు నిర్వహించారని కొనియాడారు. ఆయన కొత్తగా వెళ్లిన గ్రామంలో కూడా అదే అంకితభావంతో పనిచేసి మంచి పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు.
అనంతరం ఎంకెపల్లి గ్రామ పంచాయతీకి నూతనంగా నియమితులైన కార్యదర్శి శేఖర్‌కు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. శాలువాతో సన్మానించి, గ్రామాభివృద్ధికి ప్రజాప్రతినిధులు, ప్రజల సహకారంతో సమర్థవంతంగా సేవలు అందించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ రామప్ప, రాజేందర్, వెంకటేష్, లక్ష్మప్ప, శ్రీనివాస్, శంకరప్ప, ఎల్లప్ప, మొగులప్ప, రమేష్, నాగమణి, విజయలక్ష్మి, వెంకటమ్మ, యాదప్ప, యాదగిరి, గ్రామ పంచాయతీ సభ్యులు, గ్రామ యువకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

🗓 29 Jun 2026 | 12:13 PM ✍ Narender Patel journalist https://varahispeednews.in
Share this article: Facebook X Telegram
Scroll to Top