ఎన్నో కలలు కన్నా..
*ఒక్క డ్రీమ్ నెరవేరలేదు!*
భగవంతుడా నేను వెళ్ళిపోతున్నా
అమ్మానాన్న నన్ను క్షమించండి
సారీ స్వప్న ప్రియ నిన్ను వదిలి వెళ్తున్నా బాధపడకు
ఇంటర్ విద్యార్థి మహేశ్వరి రాసిన సూసైడ్ నోట్ ఇది
రెండు కాళ్లు విరిగి, నడుముకు తీవ్ర గాయాలు
గాంధీ ఆసుపత్రిలో చికిత్స
నాకు తెలివి వచ్చిన నుండి ఎన్నో పగటి కలలు కన్నాను.. కానీ ఒక్క డ్రీమ్ నెరవేరలేదు.. భగవంతుడా ఇక నేను ఈ లోకం నుండి వెళ్లిపోతున్నానని.. కని పెంచిన అమ్మానాన్నలకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని, నన్ను క్షమించండి అని పేర్కొంటూ.. అదేవిధంగా చిన్ననాటి స్నేహితురాలైన స్వప్నప్రియకు సారీ చెబుతూ, నేను లేనని బాధపడకు మిత్రమా అని తాండూరు గిరిజన హాస్టల్ ఇంటర్ విద్యార్థిని మహేశ్వరి సూసైడ్ నోట్లో రాసిన విషయాలు ఇవి.
ధారూర్ మండలం మైలారం తండాకు చెందిన మహేశ్వరి వికారాబాద్ జిల్లా తాండూరు మండలం జిన్ గుర్తి వద్ద గల గిరిజన హాస్టల్ లో ఇంటర్ రెండవ సంవత్సరం చదువుతుంది. నిన్న అర్ధరాత్రి సమయంలో స్కూల్ భవనం రెండవ అంతస్తు నుండి దూకి ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టింది. ఆమె వద్ద లభించిన సూసైడ్ నోట్లో పై విషయాలను ప్రస్తావించడం జరిగింది. ప్రస్తుతం మహేశ్వరి సూసైడ్ నోట్ పోలీసుల వద్ద ఉందని వారు ధ్రువీకరించారు. ఇదిలా ఉండగా ఈ ఘటనలో గాయపడ్డ మహేశ్వరికి రెండు కాళ్లు విరిగాయి, నడుముకు గాయమై హైదరాబాద్ నగరంలోని గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలిసింది.
ఎన్నో కలలు కన్నా.. *ఒక్క డ్రీమ్ నెరవేరలేదు!* హాస్టల్ భవనం పైనుంచి దూకిన విద్యార్థి
ఎన్నో కలలు కన్నా..
*ఒక్క డ్రీమ్ నెరవేరలేదు!*
భగవంతుడా నేను వెళ్ళిపోతున్నా
అమ్మానాన్న నన్ను క్షమించండి
సారీ స్వప్న ప్రియ నిన్ను వదిలి వెళ్తున్నా బాధపడకు
ఇంటర్ విద్యార్థి మహేశ్వరి రాసిన సూసైడ్ నోట్ ఇది
రెండు కాళ్లు విరిగి, నడుముకు తీవ్ర గాయాలు
గాంధీ ఆసుపత్రిలో చికిత్సనాకు తెలివి వచ్చిన నుండి ఎన్నో పగటి కలలు కన్నాను.. కానీ ఒక్క డ్రీమ్ నెరవేరలేదు.. భగవంతుడా ఇక నేను ఈ లోకం నుండి వెళ్లిపోతున్నానని.. కని పెంచిన అమ్మానాన్నలకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని, నన్ను క్షమించండి అని పేర్కొంటూ.. అదేవిధంగా చిన్ననాటి స్నేహితురాలైన స్వప్నప్రియకు సారీ చెబుతూ, నేను లేనని బాధపడకు మిత్రమా అని తాండూరు గిరిజన హాస్టల్ ఇంటర్ విద్యార్థిని మహేశ్వరి సూసైడ్ నోట్లో రాసిన విషయాలు ఇవి.