యాలాలలో సంచలనం.. స్వామీజీ ఆశ్రమంలో గంజాయి సాగు గుట్టురట్టు.

యాలాలలో సంచలనం..

స్వామీజీ ఆశ్రమంలో గంజాయి సాగు గుట్టురట్టు..!

టాస్క్‌ఫోర్స్ దాడుల్లో 25 గంజాయి మొక్కలు, ఎండు గంజాయి స్వాధీనం

ఆశ్రమంలో స్వామీజీతో పాటు మాతాజీ నివాసం.. కేసు నమోదు దిశగా విచారణ

వికారాబాద్ జిల్లా, తాండూరు నియోజకవర్గం:
యాలాల మండలంలో ఓ స్వామీజీ ఆశ్రమంలో గంజాయి సాగు జరుగుతున్నట్లు వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు ఆకస్మికంగా దాడులు నిర్వహించి సంచలన విషయాలను వెలుగులోకి వచ్చాయి.గోవిందరావుపేట శివారులో ఉన్న స్వామీజీ ఆశ్రమంపై టాస్క్‌ఫోర్స్ సీఐ ఆధ్వర్యంలో నిర్వహించిన తనిఖీల్లో సుమారు 25 గంజాయి మొక్కలతో పాటు ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఆశ్రమంలో స్వామీజీతో పాటు ఓ మాతాజీ నివాసం ఉంటున్నట్లు అధికారులు గుర్తించారు.
ఈ దాడుల్లో తాండూరు రూరల్ సీఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి, టౌన్ సీఐ పరమేశ్వర్, ఎక్సైజ్ ఎస్సై నిజాముద్దీన్, యాలాల ఎస్సై విఠల్ రెడ్డి, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ తదితర అధికారులు పాల్గొని సంఘటన స్థలంలో పంచనామా నిర్వహించారు.
స్వాధీనం చేసుకున్న గంజాయి మొక్కలు, ఎండు గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకుని, ఆశ్రమంలో గంజాయి సాగు ఎలా జరిగింది? ఇందులో మరెవరైనా ప్రమేయం ఉందా? అనే కోణంలో లోతుగా దర్యాప్తు చేపట్టారు. సంబంధిత చట్టాల ప్రకారం కేసు నమోదు చేసి తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.

🗓 17 Jul 2026 | 06:37 PM ✍ Narender Patel journalist https://varahispeednews.in
Share this article: Facebook X Telegram
Scroll to Top