తాండూరు జిల్లా ఆసుపత్రి ఎక్కడికీ వెళ్లదు..! – మంత్రి కోమటిరెడ్డి స్పష్టీకరణ
పేదల ఆసుపత్రిని కాపాడాలని బీఆర్ఎస్ కౌన్సిలర్ రూప రుద్రుపాటిల్ వినతి
. “తరలింపు ప్రశ్నే లేదు” అన్న మంత్రి
తాండూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని కోడంగల్‌కు తరలిస్తున్నారనే ప్రచారానికి రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పూర్తిస్థాయిలో తెరదించారు. ఆసుపత్రిని ఎక్కడికీ తరలించే ఆలోచన ప్రభుత్వం వద్ద లేదని, ఈ విషయంలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు.
శనివారం తాండూరు పర్యటనలో భాగంగా జిపిఆర్ గార్డెన్లో నిర్వహించిన సభలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కి తాండూరు మున్సిపల్ బీఆర్ఎస్ కౌన్సిలర్ రూప రుద్రుపాటిల్ మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి సమక్షంలో కౌన్సిలర్ రూప రుద్రుపాటిల్ తాండూరు ప్రజల్లో నెలకొన్న ఆసుపత్రి తరలింపు ఆందోళనను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
తాండూరులో వేలాది మంది పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్న జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని కోడంగల్‌కు తరలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోందని వివరణ ఇచ్చి వినతి పత్రం అందజేశారు.. పేద ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఆసుపత్రిని తాండూరులోనే కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని
కౌన్సిలర్ రూప రుద్రుపాటిల్
మంత్రిని కోరారు.
దీనిపై స్పందించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జిల్లా ఆసుపత్రి తరలింపుపై జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేశారు. తాండూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని ఎక్కడికీ తరలించే ప్రసక్తే లేదని, ప్రజలు ఎలాంటి అపోహలకు గురికావద్దని సూచించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి కూడా తాండూరు ప్రజలకు భరోసా కల్పించారు. జిల్లా ఆసుపత్రి యథావిధిగా తాండూరులోనే కొనసాగుతుందని, ప్రజలు అసత్య ప్రచారాలను నమ్మవద్దని అన్నారు.
మంత్రి, ఎమ్మెల్యే ఇచ్చిన స్పష్టమైన హామీతో తాండూరు ప్రజల్లో నెలకొన్న సందిగ్ధత తొలగిందని కౌన్సిలర్ రూప రుద్రుపాటిల్ పేర్కొన్నారు. ప్రజల తరఫున స్పందించి స్పష్టత ఇచ్చిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి కౌన్సిలర్ రూప రుద్రుపాటిల్ కృతజ్ఞతలు తెలిపారు
పేదల ఆసుపత్రిని కాపాడాలని బీఆర్ఎస్ కౌన్సిలర్ రూప రుద్రుపాటిల్ వినతి
తాండూరు జిల్లా ఆసుపత్రి ఎక్కడికీ వెళ్లదు..! – మంత్రి కోమటిరెడ్డి స్పష్టీకరణ
పేదల ఆసుపత్రిని కాపాడాలని బీఆర్ఎస్ కౌన్సిలర్ రూప రుద్రుపాటిల్ వినతి
. "తరలింపు ప్రశ్నే లేదు" అన్న మంత్రి