కొడంగల్ అభివృద్ధిపై సీఎం రేవంత్ సమీక్ష..
భూసేకరణలో నిర్లక్ష్యం వహిస్తే కలెక్టర్ల బదిలీ
ఇండస్ట్రియల్ పార్కులు, ఎడ్యుకేషన్ హబ్ కోసం సెప్టెంబర్ 30లోగా 5 వేల నుంచి 10 వేల ఎకరాల భూసేకరణ లక్ష్యం
శంషాబాద్–కొడంగల్ కనెక్టివిటీ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్లపై ప్రత్యేక దృష్టి
ప్రతి తండాకు రోడ్డు ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యం:
సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు.

ఇండస్ట్రియల్ పార్కులు, ఎడ్యుకేషన్ హబ్‌లు, రహదారులు, ఎత్తిపోతల పథకాల అభివృద్ధికి అవసరమైన భూసేకరణను అత్యంత ప్రాధాన్యతతో పూర్తి చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. భూసేకరణ విషయంలో నిర్లక్ష్యం వహించే జిల్లా కలెక్టర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే అక్టోబర్‌లో పనితీరు ఆధారంగా బదిలీలు కూడా ఉంటాయని హెచ్చరించారు.
మంగళవారం వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని దుద్యాల మండలం ఎడ్యుకేషన్ హబ్‌లో నిర్వహించిన కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధి పనుల సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి ఈ ఆదేశాలు జారీ చేశారు.
సెప్టెంబర్ 30లోగా ఇండస్ట్రియల్ పార్కులు, ఎడ్యుకేషన్ హబ్‌లు మరియు ఇతర అభివృద్ధి ప్రాజెక్టుల కోసం కనీసం 5 వేల నుంచి 10 వేల ఎకరాల భూమిని సేకరించాలని అధికారులకు స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించారు. అవసరమైతే ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు.
*హైదరాబాద్ విద్యార్థులకు కొడంగల్ కేంద్రంగా మారాలి*
కొడంగల్ నియోజకవర్గంలో ఎడ్యుకేషన్ హబ్‌లు, ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పడితే హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాల విద్యార్థులు కూడా ఇక్కడికి వచ్చి చదివే అవకాశం ఉంటుందని సీఎం పేర్కొన్నారు. ఇందుకు అవసరమైన రహదారులు, మౌలిక సదుపాయాలు, విద్యా వసతులు సమగ్రంగా అభివృద్ధి చేయాలని అధికారులకు సూచించారు.హకీంపేట్ ఎడ్యుకేషన్ హబ్‌లో సుమారు 7 వేల మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేసే అవకాశం ఉందని తెలిపారు.
*శంషాబాద్–కొడంగల్ రోడ్డు అభివృద్ధికి ప్రాధాన్యం*
బొంబాయి–పూణే కనెక్టివిటీ తరహాలో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కొడంగల్ వరకు వేగవంతమైన రోడ్డు అనుసంధానం కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.
*ఔటర్ రింగ్ రోడ్ల పనులు వేగవంతం చేయాలి*
రంగారెడ్డి–వికారాబాద్–నారాయణపేట ఔటర్ రింగ్ రోడ్ల నిర్మాణానికి సంబంధించి అన్ని శాఖల సమన్వయంతో డిజైన్లు సిద్ధం చేయాలని సూచించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణను సెప్టెంబర్ 2026లోగా పూర్తి చేసి, వెంటనే టెండర్ ప్రక్రియ ప్రారంభించాలని ఆదేశించారు.
రైతులను ఒప్పించి కాన్సెంట్ అవార్డు విధానం ద్వారా భూములు సేకరిస్తే వారికి అధిక పరిహారం లభించే అవకాశముందని అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు.
*ఎత్తిపోతల పథకంపై కీలక ఆదేశాలు*
మక్తల్–నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకానికి సంబంధించి అదనపు పంపుల ఏర్పాటుకు అవసరమైన సివిల్ పనులకు వెంటనే వర్క్ ఆర్డర్లు జారీ చేసి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
*ప్రతి తండాకు రోడ్డు లక్ష్యం*
నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల్లో అవసరమైన ఆర్ అండ్ బి రహదారుల కోసం ఇంజినీరింగ్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. ప్రత్యేక అధికారిని నియమించి నెలరోజుల్లో అన్ని మండలాల రహదారులను పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
నాకు నియోజకవర్గంలోని ప్రతి రోడ్డు నాకు తెలుసు. అవసరమైతే సందు సందు తిరుగుతాను. ప్రతి తండాకు రోడ్డు ఉండాలి. జూన్ 2, 2028 తర్వాత ఈ ప్రాంతంలో రోడ్లపై మరోసారి నిధులు ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా అభివృద్ధి చేయాలి” అని సీఎం స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే బుయ్యాని మనోహర్ రెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్ & ఆర్ అండ్ బి స్పెషల్ చీఫ్ సెక్రటరీ దాన కిషోర్, ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, రోడ్లు–భవనాల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్, హౌసింగ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వి.పి. గౌతమ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ టీకే శ్రీదేవి, వైద్య & కుటుంబ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా జెడ్ చోంగ్తు, ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్, ఇరిగేషన్ శాఖ అధికారులు, టీజీఐఐసీ అధికారులు, కడా స్పెషల్ ఆఫీసర్ వెంకట్ రెడ్డి, రాష్ట్రస్థాయి ఇంజినీర్-ఇన్-చీఫ్‌లు, వివిధ శాఖల హెచ్‌ఓడీలు పాల్గొన్నారు.
కొడంగల్ అభివృద్ధిపై సీఎం రేవంత్ సమీక్ష.. భూసేకరణలో నిర్లక్ష్యం వహిస్తే కలెక్టర్ల బదిలీ
కొడంగల్ అభివృద్ధిపై సీఎం రేవంత్ సమీక్ష..
భూసేకరణలో నిర్లక్ష్యం వహిస్తే కలెక్టర్ల బదిలీ
ఇండస్ట్రియల్ పార్కులు, ఎడ్యుకేషన్ హబ్ కోసం సెప్టెంబర్ 30లోగా 5 వేల నుంచి 10 వేల ఎకరాల భూసేకరణ లక్ష్యం
శంషాబాద్–కొడంగల్ కనెక్టివిటీ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్లపై ప్రత్యేక దృష్టి
ప్రతి తండాకు రోడ్డు ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యం:
సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు.
ఇండస్ట్రియల్ పార్కులు, ఎడ్యుకేషన్ హబ్‌లు, రహదారులు, ఎత్తిపోతల పథకాల అభివృద్ధికి అవసరమైన భూసేకరణను అత్యంత ప్రాధాన్యతతో పూర్తి చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. భూసేకరణ విషయంలో నిర్లక్ష్యం వహించే జిల్లా కలెక్టర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే అక్టోబర్‌లో పనితీరు ఆధారంగా బదిలీలు కూడా ఉంటాయని హెచ్చరించారు.
మంగళవారం వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని దుద్యాల మండలం ఎడ్యుకేషన్ హబ్‌లో నిర్వహించిన కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధి పనుల సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి ఈ ఆదేశాలు జారీ చేశారు.
సెప్టెంబర్ 30లోగా ఇండస్ట్రియల్ పార్కులు, ఎడ్యుకేషన్ హబ్‌లు మరియు ఇతర అభివృద్ధి ప్రాజెక్టుల కోసం కనీసం 5 వేల నుంచి 10 వేల ఎకరాల భూమిని సేకరించాలని అధికారులకు స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించారు. అవసరమైతే ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు.
*హైదరాబాద్ విద్యార్థులకు కొడంగల్ కేంద్రంగా మారాలి*
కొడంగల్ నియోజకవర్గంలో ఎడ్యుకేషన్ హబ్‌లు, ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పడితే హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాల విద్యార్థులు కూడా ఇక్కడికి వచ్చి చదివే అవకాశం ఉంటుందని సీఎం పేర్కొన్నారు. ఇందుకు అవసరమైన రహదారులు, మౌలిక సదుపాయాలు, విద్యా వసతులు సమగ్రంగా అభివృద్ధి చేయాలని అధికారులకు సూచించారు.హకీంపేట్ ఎడ్యుకేషన్ హబ్‌లో సుమారు 7 వేల మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేసే అవకాశం ఉందని తెలిపారు.
*శంషాబాద్–కొడంగల్ రోడ్డు అభివృద్ధికి ప్రాధాన్యం*
బొంబాయి–పూణే కనెక్టివిటీ తరహాలో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కొడంగల్ వరకు వేగవంతమైన రోడ్డు అనుసంధానం కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.
*ఔటర్ రింగ్ రోడ్ల పనులు వేగవంతం చేయాలి*
రంగారెడ్డి–వికారాబాద్–నారాయణపేట ఔటర్ రింగ్ రోడ్ల నిర్మాణానికి సంబంధించి అన్ని శాఖల సమన్వయంతో డిజైన్లు సిద్ధం చేయాలని సూచించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణను సెప్టెంబర్ 2026లోగా పూర్తి చేసి, వెంటనే టెండర్ ప్రక్రియ ప్రారంభించాలని ఆదేశించారు.
రైతులను ఒప్పించి కాన్సెంట్ అవార్డు విధానం ద్వారా భూములు సేకరిస్తే వారికి అధిక పరిహారం లభించే అవకాశముందని అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు.
*ఎత్తిపోతల పథకంపై కీలక ఆదేశాలు*
మక్తల్–నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకానికి సంబంధించి అదనపు పంపుల ఏర్పాటుకు అవసరమైన సివిల్ పనులకు వెంటనే వర్క్ ఆర్డర్లు జారీ చేసి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
*ప్రతి తండాకు రోడ్డు లక్ష్యం*
నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల్లో అవసరమైన ఆర్ అండ్ బి రహదారుల కోసం ఇంజినీరింగ్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. ప్రత్యేక అధికారిని నియమించి నెలరోజుల్లో అన్ని మండలాల రహదారులను పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
నాకు నియోజకవర్గంలోని ప్రతి రోడ్డు నాకు తెలుసు. అవసరమైతే సందు సందు తిరుగుతాను. ప్రతి తండాకు రోడ్డు ఉండాలి. జూన్ 2, 2028 తర్వాత ఈ ప్రాంతంలో రోడ్లపై మరోసారి నిధులు ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా అభివృద్ధి చేయాలి" అని సీఎం స్పష్టం చేశారు.