ఉపాధ్యాయుల హక్కుల కోసం తపస్ పోరాట శంఖారావం..! ఆగస్టు 1 మహాధర్నా పోస్టర్ ఆవిష్కరణ

ఆగస్టు 1న హైదరాబాద్‌లో తపస్ మహాధర్నా

ఉపాధ్యాయ సమస్యల పరిష్కారమే లక్ష్యం
భారీగా ఉపాధ్యాయులు తరలిరావాలని జిల్లా ప్రధాన కార్యదర్శి గాజుల బస్వరాజ్ పిలుపు

తాండూర్‌లో తపస్ మహాధర్నా పోస్టర్ ఆవిష్కరణ

విద్యారంగం, ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) ఆధ్వర్యంలో ఆగస్టు 1న హైదరాబాద్‌లో నిర్వహించనున్న మహాధర్నాను విజయవంతం చేయాలని తపస్ జిల్లా ప్రధాన కార్యదర్శి గాజుల బస్వరాజ్ ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు.గురువారం తాండూర్‌లోని తపస్ కార్యాలయంలో మహాధర్నా పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం
జిల్లా ప్రధాన కార్యదర్శి గాజుల బస్వరాజ్
మాట్లాడుతూ… ఉపాధ్యాయులు ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న సమస్యలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యారంగాన్ని బలోపేతం చేయాలంటే ఉపాధ్యాయుల సమస్యలకు ప్రభుత్వం తక్షణమే పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందని అన్నారు
.రాష్ట్ర తపస్ శాఖ పిలుపు మేరకు ఆగస్టు 1న హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద నిర్వహించే మహాధర్నాలో జిల్లా, మండల, రాష్ట్ర స్థాయి నాయకులు, సంఘ సభ్యులు, ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పాల్గొని ఉద్యమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ప్రతి ఒక్కరూ ఐక్యంగా ముందుకు రావాలని అప్పుడే ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి మార్గం దొరుకుతుందని కావున అందరు రావాలని పిలుపునిచ్చారు .
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆనందం, నియోజకవర్గ కన్వీనర్ చంద్రశేఖర్, యాలాల్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి శ్రీశైలం, పెద్దేములు మండల అధ్యక్షుడు సంతోష్ కుమార్, ప్రధాన కార్యదర్శి అనిల్, బషీరాబాద్ మండల అధ్యక్షుడు వీరేశం, తాండూర్ మండల అధ్యక్షుడు రవికుమార్, ఎం. శ్రీనివాస్, రాజు, కొత్త శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

ఉపాధ్యాయుల హక్కుల కోసం తపస్ పోరాట శంఖారావం..! ఆగస్టు 1 మహాధర్నా పోస్టర్ ఆవిష్కరణ

ఆగస్టు 1న హైదరాబాద్‌లో తపస్ మహాధర్నా

ఉపాధ్యాయ సమస్యల పరిష్కారమే లక్ష్యం
భారీగా ఉపాధ్యాయులు తరలిరావాలని జిల్లా ప్రధాన కార్యదర్శి గాజుల బస్వరాజ్ పిలుపు

తాండూర్‌లో తపస్ మహాధర్నా పోస్టర్ ఆవిష్కరణ

విద్యారంగం, ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) ఆధ్వర్యంలో ఆగస్టు 1న హైదరాబాద్‌లో నిర్వహించనున్న మహాధర్నాను విజయవంతం చేయాలని తపస్ జిల్లా ప్రధాన కార్యదర్శి గాజుల బస్వరాజ్ ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు.గురువారం తాండూర్‌లోని తపస్ కార్యాలయంలో మహాధర్నా పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం
జిల్లా ప్రధాన కార్యదర్శి గాజుల బస్వరాజ్
మాట్లాడుతూ... ఉపాధ్యాయులు ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న సమస్యలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యారంగాన్ని బలోపేతం చేయాలంటే ఉపాధ్యాయుల సమస్యలకు ప్రభుత్వం తక్షణమే పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందని అన్నారు
.రాష్ట్ర తపస్ శాఖ పిలుపు మేరకు ఆగస్టు 1న హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద నిర్వహించే మహాధర్నాలో జిల్లా, మండల, రాష్ట్ర స్థాయి నాయకులు, సంఘ సభ్యులు, ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పాల్గొని ఉద్యమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ప్రతి ఒక్కరూ ఐక్యంగా ముందుకు రావాలని అప్పుడే ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి మార్గం దొరుకుతుందని కావున అందరు రావాలని పిలుపునిచ్చారు .
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆనందం, నియోజకవర్గ కన్వీనర్ చంద్రశేఖర్, యాలాల్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి శ్రీశైలం, పెద్దేములు మండల అధ్యక్షుడు సంతోష్ కుమార్, ప్రధాన కార్యదర్శి అనిల్, బషీరాబాద్ మండల అధ్యక్షుడు వీరేశం, తాండూర్ మండల అధ్యక్షుడు రవికుమార్, ఎం. శ్రీనివాస్, రాజు, కొత్త శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

🗓 23 Jul 2026 | 07:40 PM ✍ Narender Patel journalist https://varahispeednews.in
Share this article: Facebook X Telegram
Scroll to Top