కేటీఆర్ 50వ జన్మదిన. వేడుకలు..సేవ కార్యక్రమాలు నిర్వహించిన BRSV

కేటీఆర్ 50వ జన్మదిన. వేడుకలు

“Gift a Smile”తో విద్యార్థుల ముఖాల్లో చిరునవ్వులు

సేవ కార్యక్రమాలు నిర్వహించిన BRSV

భారత రాష్ట్ర సమితి (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) 50వ జన్మదినాన్ని పురస్కరించుకుని BRSV తాండూర్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. తాండూర్ పట్టణంలోని నంబర్–1 ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థుల కోసం “Gift a Smile” కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, వారి చదువుకు తోడ్పాటుగా విద్యా సామగ్రిని పంపిణీ చేశారు.ఈ సందర్భంగా పదో తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్, జ్యామెట్రీ బాక్స్, పెన్ అందజేసి, రాబోయే పబ్లిక్ పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని, విద్యే జీవితాన్ని మార్చే గొప్ప ఆయుధమని నాయకులు సూచించారు.కేటీఆర్ జన్మదినాన్ని కేవలం వేడుకలకే పరిమితం చేయకుండా, సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాల ద్వారా నిర్వహించడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంతో విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించడంతో పాటు, పరీక్షల పట్ల మరింత ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేశామని నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో BRSV జిల్లా అధికార ప్రతినిధి దత్తాత్రేయ రావు, సందీప్ నాయక్, వినోద్ కుమార్, భాను, తోసిఫ్, రెహానాతో పాటు పలువురు BRSV విద్యార్థి నాయకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

కేటీఆర్ 50వ జన్మదిన. వేడుకలు..సేవ కార్యక్రమాలు నిర్వహించిన BRSV

కేటీఆర్ 50వ జన్మదిన. వేడుకలు

"Gift a Smile"తో విద్యార్థుల ముఖాల్లో చిరునవ్వులు

సేవ కార్యక్రమాలు నిర్వహించిన BRSV

భారత రాష్ట్ర సమితి (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) 50వ జన్మదినాన్ని పురస్కరించుకుని BRSV తాండూర్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. తాండూర్ పట్టణంలోని నంబర్–1 ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థుల కోసం "Gift a Smile" కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, వారి చదువుకు తోడ్పాటుగా విద్యా సామగ్రిని పంపిణీ చేశారు.ఈ సందర్భంగా పదో తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్, జ్యామెట్రీ బాక్స్, పెన్ అందజేసి, రాబోయే పబ్లిక్ పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని, విద్యే జీవితాన్ని మార్చే గొప్ప ఆయుధమని నాయకులు సూచించారు.కేటీఆర్ జన్మదినాన్ని కేవలం వేడుకలకే పరిమితం చేయకుండా, సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాల ద్వారా నిర్వహించడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంతో విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించడంతో పాటు, పరీక్షల పట్ల మరింత ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేశామని నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో BRSV జిల్లా అధికార ప్రతినిధి దత్తాత్రేయ రావు, సందీప్ నాయక్, వినోద్ కుమార్, భాను, తోసిఫ్, రెహానాతో పాటు పలువురు BRSV విద్యార్థి నాయకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

🗓 24 Jul 2026 | 06:09 PM ✍ Narender Patel journalist https://varahispeednews.in
Share this article: Facebook X Telegram
Scroll to Top