పుట్టినరోజును పర్యావరణ పండుగగా మార్చిన విద్యావేత్త పర్యాద రామ కృష్ణ…

శిశుమందిర్‌లో మొక్కల పంపిణీ”

తాండూర్, జూలై 29:సమాజానికి ఆదర్శంగా నిలిచేలా పుట్టినరోజు వేడుకలను నిర్వహించడం నేటి కాలంలో ఎంతో అవసరమని నిరూపించారు తాండూర్ పట్టణానికి చెందిన ప్రముఖ విద్యావేత్త పర్యాద రామకృష్ణ. తన జన్మదినాన్ని ఆడంబరాలకు దూరంగా, పర్యావరణ పరిరక్షణకు అంకితం చేస్తూ తాండూర్ పట్టణంలోని శిశుమందిర్ పాఠశాలలో విద్యార్థులకు మొక్కలు పంపిణీ చేసి, వారితో కలిసి మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా పర్యాద రామ కృష్ణ మాట్లాడుతూ..

ప్రకృతిని కాపాడితేనే భవిష్యత్ తరాలకు సురక్షితమైన జీవనాన్ని అందించగలం అన్నారు. ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కను నాటి, అది పెద్ద వృక్షంగా ఎదిగే వరకు సంరక్షించడం తమ సామాజిక బాధ్యతగా భావించాలి అని పేర్కొన్నారు.
పర్యావరణ సమతుల్యతను కాపాడడంలో వృక్షాల పాత్ర అత్యంత కీలకమని, వాతావరణ మార్పులు, పెరుగుతున్న కాలుష్యం, ఉష్ణోగ్రతల పెరుగుదల వంటి సమస్యలకు మొక్కల పెంపకమే శాశ్వత పరిష్కారమని ఆయన వివరించారు. ముఖ్యంగా విద్యార్థులు ఈరోజు విద్యార్థులు… రేపటి పర్యావరణ పరిరక్షకులు అనే భావనతో ముందుకు వచ్చి వృక్ష సంపదను పెంపొందించాలని, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించే దిశగా కుటుంబాలు, సమాజంలో అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.
మొక్కలు నాటడం ఒక కార్యక్రమం మాత్రమే కాకుండా, వాటిని సంరక్షించడం ద్వారానే పర్యావరణ పరిరక్షణ లక్ష్యం నెరవేరుతుందని అన్నారు.పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు వంటి ప్రతి శుభసందర్భాన్ని హరితోత్సవంగా నిర్వహించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో రిటైర్డ్ డిగ్రీ అధ్యాపకులు డా. మల్లేశం, పెరుమాళ్ల రాంరెడ్డి, ఆనంతరెడ్డి, శిశుమందిర్ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విజయలక్ష్మి, ఉపాధ్యాయులు రాంసాగర్, విశాల్, సాయి, నవీన్తో పాటు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

పుట్టినరోజును పర్యావరణ పండుగగా మార్చిన విద్యావేత్త పర్యాద రామ కృష్ణ…

పుట్టినరోజును పర్యావరణ పండుగగా మార్చిన విద్యావేత్త పర్యాద రామ కృష్ణ...

శిశుమందిర్‌లో మొక్కల పంపిణీ"

తాండూర్, జూలై 29:సమాజానికి ఆదర్శంగా నిలిచేలా పుట్టినరోజు వేడుకలను నిర్వహించడం నేటి కాలంలో ఎంతో అవసరమని నిరూపించారు తాండూర్ పట్టణానికి చెందిన ప్రముఖ విద్యావేత్త పర్యాద రామకృష్ణ. తన జన్మదినాన్ని ఆడంబరాలకు దూరంగా, పర్యావరణ పరిరక్షణకు అంకితం చేస్తూ తాండూర్ పట్టణంలోని శిశుమందిర్ పాఠశాలలో విద్యార్థులకు మొక్కలు పంపిణీ చేసి, వారితో కలిసి మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా పర్యాద రామ కృష్ణ మాట్లాడుతూ..

ప్రకృతిని కాపాడితేనే భవిష్యత్ తరాలకు సురక్షితమైన జీవనాన్ని అందించగలం అన్నారు. ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కను నాటి, అది పెద్ద వృక్షంగా ఎదిగే వరకు సంరక్షించడం తమ సామాజిక బాధ్యతగా భావించాలి అని పేర్కొన్నారు.
పర్యావరణ సమతుల్యతను కాపాడడంలో వృక్షాల పాత్ర అత్యంత కీలకమని, వాతావరణ మార్పులు, పెరుగుతున్న కాలుష్యం, ఉష్ణోగ్రతల పెరుగుదల వంటి సమస్యలకు మొక్కల పెంపకమే శాశ్వత పరిష్కారమని ఆయన వివరించారు. ముఖ్యంగా విద్యార్థులు ఈరోజు విద్యార్థులు... రేపటి పర్యావరణ పరిరక్షకులు అనే భావనతో ముందుకు వచ్చి వృక్ష సంపదను పెంపొందించాలని, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించే దిశగా కుటుంబాలు, సమాజంలో అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.
మొక్కలు నాటడం ఒక కార్యక్రమం మాత్రమే కాకుండా, వాటిని సంరక్షించడం ద్వారానే పర్యావరణ పరిరక్షణ లక్ష్యం నెరవేరుతుందని అన్నారు.పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు వంటి ప్రతి శుభసందర్భాన్ని హరితోత్సవంగా నిర్వహించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో రిటైర్డ్ డిగ్రీ అధ్యాపకులు డా. మల్లేశం, పెరుమాళ్ల రాంరెడ్డి, ఆనంతరెడ్డి, శిశుమందిర్ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విజయలక్ష్మి, ఉపాధ్యాయులు రాంసాగర్, విశాల్, సాయి, నవీన్తో పాటు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

🗓 29 Jul 2026 | 01:11 PM ✍ Narender Patel journalist https://varahispeednews.in
Share this article: Facebook X Telegram
Scroll to Top