తాండూరు నియోజకవర్గంలో SIR ప్రక్రియ వేగవంతం..
72.47 శాతం ఎలెక్టర్ ఫారాల డిజిటలైజేషన్ పూర్తి
మొత్తం 2,15,559 ఓటర్ల ఫారాల డిజిటలైజేషన్ పూర్తి
ఆగస్టు 3తో SIR ప్రక్రియ ముగింపు..
మిగిలిన ఓటర్లు వెంటనే ఫారాలు సమర్పించాలి.
బషీరాబాద్ మండలం 96.75 శాతంతో ముందంజ
తాండూరు నియోజకవర్గ SIR కన్వీనర్ కరణం పురుషోత్తంరావు
తాండూరు, జూలై 29: తాండూరు నియోజకవర్గంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) ప్రక్రియ వేగంగా కొనసాగుతోందని, ఇప్పటివరకు 72.47 శాతం ఎలెక్టర్ ఫారాల (EFE) డిజిటలైజేషన్ పూర్తయిందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర SIR ప్రచార కమిటీ సభ్యులు, తాండూరు నియోజకవర్గ SIR కన్వీనర్ కరణం పురుషోత్తంరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ..
తాండూర్ నియోజకవర్గంలో మొత్తం 2,15,559 మంది ఓటర్లకు సంబంధించిన ఫారాలు, అలాగే ASD (Absent, Shifted, Dead) వివరాలతో కలిపి డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తయిందని ఆయన వెల్లడించారు. అర్హత కలిగిన ఓటర్లలో ఇప్పటివరకు 1,82,804 ఫారాలు డిజిటలైజ్ చేయగా, ఇంకా 36,676 ఫారాలు డిజిటలైజేషన్‌కు మిగిలి ఉన్నాయని పేర్కొన్నారు. ASD వివరాలతో కలిపి మొత్తం ప్రక్రియ 85.46 శాతం పూర్తయిందన్నారు.తాండూరు నియోజకవర్గంలోని 33 పోలింగ్ స్టేషన్లలో SIR ప్రక్రియ 100 శాతం పూర్తయిందని తెలిపారు. వాటిలో యాలాల మండలంలో 12, తాండూరు మండలంలో 4, పెద్దేముల్ మండలంలో 5, బషీరాబాద్ మండలంలో 12 పోలింగ్ స్టేషన్లు పూర్తిస్థాయిలో ప్రక్రియను ముగించాయని చెప్పారు.మండలాల వారీగా పరిశీలిస్తే బషీరాబాద్ మండలం 96.75 శాతం డిజిటలైజేషన్‌తో ముందంజలో ఉండగా, ఇంకా 1,343 ఫారాలు మాత్రమే మిగిలి ఉన్నాయని తెలిపారు. యాలాల మండలంలో 92.69 శాతం, పెద్దేముల్ మండలంలో 92.77 శాతం, తాండూరు మండలంలో 87.68 శాతం డిజిటలైజేషన్ పూర్తయిందన్నారు. తాండూరు పట్టణంలో మాత్రం 68.94 శాతం మాత్రమే పూర్తైందని, అక్కడ ఇంకా 22,968 ఫారాల డిజిటలైజేషన్ చేయాల్సి ఉందని వెల్లడించారు.ఆగస్టు 3వ తేదీతో SIR ప్రక్రియ ముగియనున్న నేపథ్యంలో, ఓటు హక్కును కోల్పోకుండా ప్రతి అర్హత కలిగిన ఓటరు వెంటనే తమ ఫారాలను పూర్తి చేసి సంబంధిత BLOలకు అందజేయాలని కరణం పురుషోత్తంరావు కోరారు. BLOలు, BLAలు, సూపర్వైజర్లు సమన్వయంతో ఇంటింటికీ వెళ్లి మిగిలిన ఓటర్లను గుర్తించి అవగాహన కల్పించాలని సూచించారు.

తాండూరు నియోజకవర్గంలో SIR ప్రక్రియ వేగవంతం.. 72.47 శాతం ఎలెక్టర్ ఫారాల డిజిటలైజేషన్ పూర్తి

ఓటు హక్కు ప్రతి పౌరుడి రాజ్యాంగబద్ధమైన హక్కు అని పేర్కొన్న ఆయన, SIR ప్రక్రియ విజయవంతమైతే ఓటరు జాబితా మరింత ఖచ్చితంగా, విశ్వసనీయంగా తయారవుతుందని తెలిపారు. ప్రజాస్వామ్య బలోపేతానికి ప్రతి ఓటరు భాగస్వామ్యం అవసరమని, మిగిలిన వారంతా గడువు ముగిసేలోపు డిజిటలైజేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని పిలుపునిచ్చారు.