రూ.5 లక్షలతో ఓపెన్ జిమ్ పార్క్ అభివృద్ధి పనులకు శ్రీకారం
12వ వార్డులో చైర్‌పర్సన్ నీరజా బాల్‌రెడ్డి ప్రారంభం – ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యమని వెల్లడి
తాండూర్ పట్టణంలోని 12వ వార్డులో రూ.5 లక్షల వ్యయంతో చేపడుతున్న ఓపెన్ జిమ్ పార్క్ అభివృద్ధి పనులను మున్సిపల్ చైర్‌పర్సన్ నీరజా బాల్‌రెడ్డి సోమవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి సహకారంతో పట్టణంలో ఓపెన్ జిమ్‌ల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణతో పాటు యువత, మహిళలు, వృద్ధులు సహా అన్ని వయసుల వారు నిత్యం వ్యాయామం చేసేందుకు ఓపెన్ జిమ్ పార్క్‌లు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.
పట్టణ అభివృద్ధితో పాటు ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు, ఆరోగ్యవంతమైన వాతావరణాన్ని కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమని ఆమె అన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్, మున్సిపల్ కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు

రూ.5 లక్షలతో ఓపెన్ జిమ్ పార్క్ అభివృద్ధి పనులకు శ్రీకారం
రూ.5 లక్షలతో ఓపెన్ జిమ్ పార్క్ అభివృద్ధి పనులకు శ్రీకారం
12వ వార్డులో చైర్‌పర్సన్ నీరజా బాల్‌రెడ్డి ప్రారంభం – ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యమని వెల్లడితాండూర్ పట్టణంలోని 12వ వార్డులో రూ.5 లక్షల వ్యయంతో చేపడుతున్న ఓపెన్ జిమ్ పార్క్ అభివృద్ధి పనులను మున్సిపల్ చైర్‌పర్సన్ నీరజా బాల్‌రెడ్డి సోమవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి సహకారంతో పట్టణంలో ఓపెన్ జిమ్‌ల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణతో పాటు యువత, మహిళలు, వృద్ధులు సహా అన్ని వయసుల వారు నిత్యం వ్యాయామం చేసేందుకు ఓపెన్ జిమ్ పార్క్‌లు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.

Oplus_16908288