తాండూర్‌లో కాంగ్రెస్ కనిపించడంలేదు: బీఆర్ఎస్ ఇన్‌చార్జ్ శ్రీశైల్ రెడ్డి పంజుగుల

తాండూర్‌లో SIR ప్రక్రియపై బీఆర్ఎస్ సమీక్షా సమావేశం

నియోజకవర్గంలో 71 శాతం డిజిటలైజేషన్ పూర్తైందని వెల్లడి

బోగస్, డబుల్, మృతుల ఓట్ల తొలగింపుతో ప్రక్రియ కొంత ఆలస్యం

మిగిలిన గడువులో పార్టీ శ్రేణులు మరింత చురుకుగా పనిచేయాలని పిలుపు

తాండూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో కనిపించడంలేదని, అధికారంలో ఉన్నప్పటికీ ప్రజా సమస్యలపై దృష్టి సారించడం లేదని బీఆర్ఎస్ తాండూర్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ శ్రీశైల్ రెడ్డి పంజుగుల విమర్శించారు. ఎకరాల్లో భూములు కొనుగోలు చేసి గజాల్లో విక్రయించడం వంటి అంశాలను పక్కనపెట్టి SIR ప్రక్రియపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి సైతం తాండూర్ ఎమ్మెల్యేకు సూచించాల్సిన పరిస్థితి రావడం కాంగ్రెస్ పనితీరుకు నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు.మంగళవారం తాండూర్‌లోని బీఆర్ఎస్ పార్టీ క్యాంప్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పిలుపు మేరకు ప్రత్యేక SIR సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన శ్రీశైల్ రెడ్డి పంజుగుల మాట్లాడుతూ, నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ బీఎల్‌ఏలు, నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పనిచేస్తున్నారని తెలిపారు.
ఆర్డీవో లెక్కల ప్రకారం తాండూర్ నియోజకవర్గంలో SIR ప్రక్రియలో భాగంగా సుమారు 71 శాతం డిజిటలైజేషన్ పూర్తి అయినట్లు తెలిపారు. మిగిలిన ప్రక్రియను కూడా నిర్ణీత గడువులో పూర్తి చేయడానికి పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేస్తున్నాయని పేర్కొన్నారు.తాండూర్ పట్టణంలో బోగస్ ఓట్లు, డబుల్ ఓట్లు, మృతుల పేర్లపై ఉన్న ఓట్లు, ఇతర ప్రాంతాలకు మారిన వారి ఓట్ల పరిశీలన ఎక్కువగా జరుగుతుండటంతో ప్రక్రియ కొంత ఆలస్యమవుతోందని వివరించారు. అయినప్పటికీ మిగిలిన ఆరు రోజుల గడువులో ప్రతి గ్రామంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు మరింత అప్రమత్తంగా పనిచేస్తారని తెలిపారు.ప్రజాస్వామ్య ప్రక్రియలను బలోపేతం చేయడమే బీఆర్ఎస్ లక్ష్యమని, అధికారంలో ఉన్నా లేక ప్రతిపక్షంలో ఉన్నా ఓటరు జాబితా ప్రక్షాళనలో పార్టీ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుందని శ్రీశైల్ రెడ్డి అన్నారు. పార్టీ అధిష్టానం, మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఆదేశాల మేరకు SIR ప్రక్రియలో చురుకుగా పాల్గొంటున్నామని, తెలంగాణ వ్యాప్తంగా ఈ ప్రక్రియ పారదర్శకంగా జరగాలన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్ష మేరకు పనిచేస్తున్నామని పేర్కొన్నారు.ఇప్పటికీ ఎన్యుమరేషన్ ఫారాలు తిరిగి సమర్పించని వారు వెంటనే అందజేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అలాగే ఇతర ప్రాంతాల్లో ఓటు ఉన్నవారు అక్కడి ఓటును తొలగించుకుని తాండూర్‌లోనే తమ ఓటు నమోదు చేసుకోవాలని సూచించారు. మిగిలిన గడువును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.ఈ సమీక్షా సమావేశంలో నియోజకవర్గ సీనియర్ నాయకులు, మండల అధ్యక్షులు, కౌన్సిలర్లు, ముఖ్య నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

🗓 04 Aug 2026 | 05:08 PM ✍ Narender Patel journalist https://varahispeednews.in
Share this article: Facebook X Telegram
Scroll to Top