ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా రాజస్థానీ మహిళ మండలి ఆధ్వర్యంలో రక్తదానం
ప్రభుత్వ ఆసుపత్రి రక్తనిధి కేంద్రంలో 12 మంది మహిళల స్వచ్ఛంద రక్తదానం
“మానవ సేవే మాధవ సేవ” అంటూ యువతకు మహిళ మండలి పిలుపు
22 ఏళ్ల శృతి సార్డా తొలి రక్తదాతగా ఆదర్శం
తాండూరు, జూన్ 14 : ప్రపంచ రక్తదాన దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజస్థానీ మహిళ మండలి ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలోని రక్తనిధి కేంద్రంలో ఆదివారం స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళ మండలికి చెందిన 12 మంది సభ్యులు రక్తదానం చేసి సామాజిక సేవలో తమ ప్రత్యేకతను చాటుకున్నారు.

ఈ కార్యక్రమంలో తొలి రక్తదాతగా 22 సంవత్సరాల యువతి శృతి సార్డా రక్తదానం చేసి అందరికీ ఆదర్శంగా నిలిచిందని ఆమె తెలిపారు.
ఈ కార్యక్రమంలో మహిళ మండలి కార్యదర్శి వర్షా సార్డా, సభ్యులు రీతూ సోనీ, సీమా సార్డా, నిఖిత బూబ్, దీపా బూబ్ పాల్గొన్నారు. అలాగే మంచ్ సభ్యులు మన్మోహన్ సార్డా, కరణ్ జైన్, భరత్ దేవ్డా, రమాకాంత్ పండిట్, అనిల్ సార్డా, దినేశ్ పరథానీ, అభిషేక్ అగర్వాల్ తదితరులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా రాజస్థానీ మహిళ మండలి ఆధ్వర్యంలో రక్తదానం
ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా రాజస్థానీ మహిళ మండలి ఆధ్వర్యంలో రక్తదానం
ప్రభుత్వ ఆసుపత్రి రక్తనిధి కేంద్రంలో 12 మంది మహిళల స్వచ్ఛంద రక్తదానం
"మానవ సేవే మాధవ సేవ" అంటూ యువతకు మహిళ మండలి పిలుపు
22 ఏళ్ల శృతి సార్డా తొలి రక్తదాతగా ఆదర్శం
తాండూరు, జూన్ 14 : ప్రపంచ రక్తదాన దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజస్థానీ మహిళ మండలి ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలోని రక్తనిధి కేంద్రంలో ఆదివారం స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళ మండలికి చెందిన 12 మంది సభ్యులు రక్తదానం చేసి సామాజిక సేవలో తమ ప్రత్యేకతను చాటుకున్నారు.
ఈ సందర్భంగా రాజస్థానీ మహిళ మండలి అధ్యక్షురాలు శ్రీమతి కిరణ్ సార్డా మాట్లాడుతూ, మహిళలు ఇంటి బాధ్యతలను నిర్వర్తించడంతో పాటు సమాజ సేవలో కూడా ముందుంటారని పేర్కొన్నారు. "మానవ సేవే మాధవ సేవ" అనే స్ఫూర్తితో యువతులు కూడా ముందుకు వచ్చి రక్తదానం చేయడం అభినందనీయమని అన్నారు.