తాండూరు మున్సిపల్ పరిధిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా తాండూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి తాండూరు మున్సిపల్ పరిధిలో ఎన్నికల ప్రచారాన్ని చేశారు. సోమవారం తాండూరు మున్సిపాలిటీలోని 09వ వార్డు సాయిపూర్ ప్రాంతంలో కాంగ్రెస్ నాయకులతో కలిసి విస్తృతంగా పర్యటించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తరపున పోటీచేసే వారిని గెలిపించాలని అభ్యర్థించారు.వార్డులోని ప్రతి ఇంటికి తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను వివరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశం లో మాట్లాడుతూ.. పట్టణ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేసే అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని అన్నారు. 9వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి పట్లోళ్ళ చైతన్య ప్రశాంత్ ను ‘చేయి’ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, ముఖ్య కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో మహిళలు, యువకులు పాల్గొన్నారు.