అభివృద్ధి కోసం ఓటెయ్యండి -బిఆర్ఎస్ అభ్యర్థి నాగలక్ష్మి ఇంటింటి ప్రచారం

అభివృద్ధి కోసం ఓటెయ్యండి
-బిఆర్ఎస్ అభ్యర్థి నాగలక్ష్మి ఇంటింటి ప్రచారం
-వార్డ్ నెంబర్ 1 లో విజయం సాధిస్తా
-బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ధనసిరి నాగలక్ష్మి

తాండూరు ఫిబ్రవరి 3…. వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపల్ లో జరగనున్న కౌన్సిలర్ ఎన్నికలలో ఒకటో నెంబరు వార్డు నుంచి పోటీ చేస్తున్న బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ధనసిరి నాగలక్ష్మి తనకి ఓటు వేయాలని వార్డు ప్రజలను కోరుతు ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. మంగళవారం రోజు సెయింట్ మేరీ ఉన్నత సమీపంలోని ప్రజలను కలిసి కారు గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. వార్డు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని చెప్పారు. తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అండ దండాలతో తను విజయం సాధిస్తాననే నమ్మకం తనకు కలిగిందన్నారు. వార్డు ప్రజలకు అందుబాటులో ఉండి అర్హులైన అందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించే విధంగా పనిచేస్తానని చెప్పారు. ఈనెల 11న జరిగే మున్సిపల్ ఎన్నికలలో తనను గెలిపించడం కోసం మీరందరూ కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ప్రచార కార్యక్రమానికి 1వ నంబర్ వార్డు ప్రజలు, మహిళలు కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.

అభివృద్ధి కోసం ఓటెయ్యండి -బిఆర్ఎస్ అభ్యర్థి నాగలక్ష్మి ఇంటింటి ప్రచారం

అభివృద్ధి కోసం ఓటెయ్యండి
-బిఆర్ఎస్ అభ్యర్థి నాగలక్ష్మి ఇంటింటి ప్రచారం
-వార్డ్ నెంబర్ 1 లో విజయం సాధిస్తా
-బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ధనసిరి నాగలక్ష్మి

తాండూరు ఫిబ్రవరి 3.... వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపల్ లో జరగనున్న కౌన్సిలర్ ఎన్నికలలో ఒకటో నెంబరు వార్డు నుంచి పోటీ చేస్తున్న బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ధనసిరి నాగలక్ష్మి తనకి ఓటు వేయాలని వార్డు ప్రజలను కోరుతు ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. మంగళవారం రోజు సెయింట్ మేరీ ఉన్నత సమీపంలోని ప్రజలను కలిసి కారు గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. వార్డు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని చెప్పారు. తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అండ దండాలతో తను విజయం సాధిస్తాననే నమ్మకం తనకు కలిగిందన్నారు. వార్డు ప్రజలకు అందుబాటులో ఉండి అర్హులైన అందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించే విధంగా పనిచేస్తానని చెప్పారు. ఈనెల 11న జరిగే మున్సిపల్ ఎన్నికలలో తనను గెలిపించడం కోసం మీరందరూ కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ప్రచార కార్యక్రమానికి 1వ నంబర్ వార్డు ప్రజలు, మహిళలు కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.

🗓 03 Feb 2026 | 12:16 PM ✍ Narender Patel journalist https://varahispeednews.in
Share this article: Facebook X Telegram
Scroll to Top