వికారాబాద్ జిల్లా బీజేపీ పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధం

వికారాబాద్ జిల్లా బీజేపీ పార్టీసిద్ధాంతాలకు విరుద్ధం

పనిచేసే వారికి గుర్తింపు లేదు
పార్టీలో అనర్హుడికి కౌన్సిలర్ టిక్కెట్

బిజెపి పార్టీ సభ్యత్వానికి రాజినామా

బీజేపీ జిల్లా సీనియర్ నేత సుదర్శన్ గౌడ్

వికారాబాద్ జిల్లాలోని బిజెపి పార్టీ నాయకులు నేతలు జిల్లాలో అసమర్ధ నాయకత్వం అవలంబిస్తూ స్వార్థ రాజకీయాలు చేస్తున్నారని, పార్టీ సిద్ధాంతాల కోసం వారికి స్థానం లేకుండా చేస్తున్నారని బిజెపి పార్టీ జిల్లా
ఉపాధ్యక్షులు సుదర్శన్ గౌడ్ మండిపడ్డారు. బుధవారం బిజెపి పార్టీ జిల్లా ఉపాధ్యక్ష పదవితో పాటు సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా మీడియాతో సుదర్శన్ గౌడ్ మాట్లాడుతూ.. తన
తండ్రి, మున్సిపల్ మాజీ చైర్మన్ సత్తయ్య గౌడ్ ఆశయాలతో, పార్టీ సిద్ధాంతలకు లోబడి బీజేపీ పార్టీ కోసం అహర్నిశలు కృషి చేయడం జరిగిందని అన్నారు.కానీ వికారాబాద్ జిల్లా బిజెపి నేతల వల్ల తన కుటుంబానికి కాదని ఈ మున్సిపల్ ఎన్నికల్లో సొంత పార్టీకి చెందిన అనర్హుడికి పార్టీ టిక్కెట్ ఇచ్చారని మండిపడ్డారు. గత గ్రామపంచాయతీ ఎన్నికల్లోవికారాబాద్ జిల్లా కొత్తపల్లి లో ఓటు హక్కు కలిగి ఉన్న పట్టణ అధ్యక్షులు నాగారం మల్లేశంకు టిక్కెట్ ఇచ్చారని ఇది విరుద్ధమని మండిపడ్డారు. ఈ విషయంలో రాష్ట్ర అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు, అధిష్టాన నేతలనుప్రశ్నించిన ఫలితం లేదని అన్నారు.
మున్సిపల్ ఎన్నికల్లో 28వ వార్డులో ఓటర్లు బీజేపీకి ఓటు వేస్తే ఆ ఓట్లు చెల్లకుండా పోతాయని వెల్లడించారు. జిల్లా పార్టీలో స్వార్థ రాజకీయాలు, ఎంపీ జోక్యం, ఎంపీపీఏ అసమర్థత కారణంగా సభ్యత్వానికి రాజీనామ చేస్తున్నట్లు ప్రకటించారు.
అదేవిధంగా ఏ పార్టీలో చేరుతామన్నది త్వరలోనే ప్రకటిస్తా అని తెలిపారు.

🗓 04 Feb 2026 | 06:28 PM ✍ Narender Patel journalist https://varahispeednews.in
Share this article: Facebook X Telegram
Scroll to Top