అభివృద్ధి కోసం గెలిపించండి
-బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి డి నాగలక్ష్మి

తాండూరు ఫిబ్రవరి 2 :- ఈనెల 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికలలో మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపించండి వార్డు అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తానని బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ధనసిరి నాగలక్ష్మి స్థానిక వార్డు ప్రజలను కోరారు. సోమవారం రోజు ఒకటో నెంబర్ వార్డులోని ఇంటింటికి తిరిగి కారు గుర్తుకు ఓటు వేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. వార్డు ప్రజలకు అన్నివేళలా అందుబాటులో ఉండి అభివృద్ధి కోసం కృషి చేస్తానని చెప్పారు. మాట ప్రకారం నిలబడే తత్వం మాదని ప్రజలకు అభయమిచ్చారు. మాయమాటలకు ప్రలోభాలకు తలవంచకుండా తనును ఆదరించాలని కోరారు. ఈనెల 11న జరిగే ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా గెలిపించి వార్డు అభివృద్ధికి సహకరించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు బి ఆర్ఎస్ కార్యకర్తలు, స్థానిక యువకులు మహిళలు ఉన్నారు.
ఓ
అభివృద్ధి కోసం గెలిపించండి -బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి డి నాగలక్ష్మి
అభివృద్ధి కోసం గెలిపించండి
-బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి డి నాగలక్ష్మి
తాండూరు ఫిబ్రవరి 2 :- ఈనెల 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికలలో మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపించండి వార్డు అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తానని బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ధనసిరి నాగలక్ష్మి స్థానిక వార్డు ప్రజలను కోరారు. సోమవారం రోజు ఒకటో నెంబర్ వార్డులోని ఇంటింటికి తిరిగి కారు గుర్తుకు ఓటు వేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. వార్డు ప్రజలకు అన్నివేళలా అందుబాటులో ఉండి అభివృద్ధి కోసం కృషి చేస్తానని చెప్పారు. మాట ప్రకారం నిలబడే తత్వం మాదని ప్రజలకు అభయమిచ్చారు. మాయమాటలకు ప్రలోభాలకు తలవంచకుండా తనును ఆదరించాలని కోరారు. ఈనెల 11న జరిగే ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా గెలిపించి వార్డు అభివృద్ధికి సహకరించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు బి ఆర్ఎస్ కార్యకర్తలు, స్థానిక యువకులు మహిళలు ఉన్నారు.ఓ
