9,10 వార్డులలో జోరుగా బిఆర్ఎస్ పార్టీ ప్రచారం

ఇంటింటికి భార్యాభర్తల గెలుపు లక్ష్యంగా ప్రచారం

పట్లోళ్ల నర్సింలు, దీప నర్సింలు ప్రచారంపై అభిమానుల ఉత్సాహం

తాండూర్ మున్సిపల్ పరిధిలోని సాయిపూర్ ప్రాంతంలో గల 9వ వార్డు, 10 వార్డులలో గెలుపే లక్ష్యంగా బిఆర్ఎస్ పార్టీ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తుంది.10,9 వార్డులలో పోటీ చేస్తున్న పట్లోళ్ల నర్సింలు, ఆయన సతీమణి దీపా నర్సింలు
ఇంటింటికి తిరుగుతూ ప్రతి ఒక్కరిని కలుస్తూ ఓటును అభ్యర్థిస్తున్నారు. ఈ ఇద్దరు భార్యాభర్తల వెంట వారి అభిమానులు కుటుంబీకులు ఉత్సాహంగా పాల్గొంటూ ప్రచారం నిర్వహిస్తున్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ .. తాండూర్ మున్సిపల్ పరిధిలో బీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయమని, అభివృద్ధి చేసేది బిఆర్ఎస్ ద్వారానే అవుతుందని , గతంలో చేసిన పలు వార్డుల అభివృద్ధి తమ గెలుపుకు నాంది అని అన్నారు. వచ్చే ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమని ప్రజలు ఇది గమనించాలని, కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

🗓 04 Feb 2026 | 05:32 PM ✍ Narender Patel journalist https://varahispeednews.in
Share this article: Facebook X Telegram
Scroll to Top