ఆత్మీయతా దినోత్సవ వేడుకలు – అర్హులైన పేదలకు ఉచిత వైద్య శిబిరం

ఆత్మీయతా దినోత్సవ వేడుకలు
– అర్హులైన పేదలకు ఉచిత వైద్య శిబిరం
– పేద విద్యార్థులకు సైకిళ్ళు.. పేదలకు వస్త్ర బహూకరణవికారాబాద్:శ్రీశ్రీశ్రీ గురువిశ్వాస్ఫూర్తి జన్మదినాన్ని పురస్కరించుకొని బండ్లగూడ జాగిర్ నందు ఆత్మీయత దినోత్సవంగా శుక్రవారం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గురూజీ సూచించిన ప్రస్థాన ధ్యానం, ఆసన, ప్రాణాయామ ధ్యానము నిర్వహించారు. అనంతరం అర్హులైన పేదలకు ఉచిత వైద్య శిబిరం,పేద విద్యార్థులకు సైకిళ్ళు,పేదలకు వస్త్ర బహుకరణ కార్యక్రమం నిర్వహించి పాల్గొన్న భక్తులు గురూజీ దివ్య ఆశీస్సులు పొంది మహా ప్రసాదాన్ని స్వీకరించారు.ముఖ్య అతిథి ఆచార్య గౌరీ శంకర్ మాట్లాడుతూ..గురూజీ జన్మదినానికి గుర్తుగా ప్రతి భక్తుడు తమలో ఏదైనా చెడు అలవాటు వదిలేయాలని,దాని స్థానంలో మంచినితనలోకితీసుకోవాలన్నారు.మనోధైర్యం,ఆత్మవిశ్వాసం,శ్రమ దీక్ష సత్ఫలితాలను ఇస్తాయని పేర్కొన్నారు. మనిషి మనసు మధ్య సఖ్యత, సామరస్యతకు యోగ సాధన, ధ్యాన మనోప్రస్థానం మేలు చేస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ఆత్మీయతా దినోత్సవ వేడుకలు – అర్హులైన పేదలకు ఉచిత వైద్య శిబిరం

ఆత్మీయతా దినోత్సవ వేడుకలు
- అర్హులైన పేదలకు ఉచిత వైద్య శిబిరం
- పేద విద్యార్థులకు సైకిళ్ళు.. పేదలకు వస్త్ర బహూకరణవికారాబాద్:శ్రీశ్రీశ్రీ గురువిశ్వాస్ఫూర్తి జన్మదినాన్ని పురస్కరించుకొని బండ్లగూడ జాగిర్ నందు ఆత్మీయత దినోత్సవంగా శుక్రవారం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గురూజీ సూచించిన ప్రస్థాన ధ్యానం, ఆసన, ప్రాణాయామ ధ్యానము నిర్వహించారు. అనంతరం అర్హులైన పేదలకు ఉచిత వైద్య శిబిరం,పేద విద్యార్థులకు సైకిళ్ళు,పేదలకు వస్త్ర బహుకరణ కార్యక్రమం నిర్వహించి పాల్గొన్న భక్తులు గురూజీ దివ్య ఆశీస్సులు పొంది మహా ప్రసాదాన్ని స్వీకరించారు.ముఖ్య అతిథి ఆచార్య గౌరీ శంకర్ మాట్లాడుతూ..గురూజీ జన్మదినానికి గుర్తుగా ప్రతి భక్తుడు తమలో ఏదైనా చెడు అలవాటు వదిలేయాలని,దాని స్థానంలో మంచినితనలోకితీసుకోవాలన్నారు.మనోధైర్యం,ఆత్మవిశ్వాసం,శ్రమ దీక్ష సత్ఫలితాలను ఇస్తాయని పేర్కొన్నారు. మనిషి మనసు మధ్య సఖ్యత, సామరస్యతకు యోగ సాధన, ధ్యాన మనోప్రస్థానం మేలు చేస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

🗓 01 May 2026 | 04:00 PM ✍ Narender Patel journalist https://varahispeednews.in
Share this article: Facebook X Telegram
Scroll to Top