*జీవితం పై విరక్తి చెంది తల్లి కొడుకు అత్మహత్య*

*యాలాల ఇందిరమ్మ కాలనీ లో ఘటన*

*యాలాల.*.వికారాబాద్ జిల్లా యాలాల మండలం ఇందిరమ్మ కాలనీ లో ఉండే వివాహిత తన కొడుకు కు ఉరి వేసి తాను కూడా ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం జరిగింది. యాలాల ఎస్సై విఠల్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం యాలాల యాలాల పోలీసు స్టేషన్ పరిధిలో గల ఇందిరమ్మ కాలనీ లో గల బ్లాక్ సంఖ్య 28 లో గల రూమ్ సంఖ్య 1 లో బుడుగ జంగం గౌరమ్మ తన కొడుకు రవికాంత్ తో కలిసి నివాసముంటుంది. అదే బ్లాక్ లో తన తల్లిదండ్రులు మరియు అన్న దమ్ములు కూడా ఉంటారు. శుక్రవారం అందాజ సమయం 5 గంటలకు ఆమె అన్న తుల్జరామ్ ఆమె ఇంటి తలుపు పగులగొట్టి లోపలికి వెళ్లగా గౌరమ్మ జీవితం పై విరక్తి తో తన కొడుకు రవికాంత్ కు ఉరి వేసి తాను కూడా ఉరి వేసుకుని చనిపోయిందని కుటుంబ సభ్యులు తెలిపినారు. ఇట్టి మరణం పై ఎటువంటి అనుమానం లేదని కుటుంబ సభ్యులు తెలిపినారు. ఈ విషయమై తల్లి పోచమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం జరుగుతుందని యాలాల ఎస్సై ఒక ప్రకటన తెలిపారు

🗓 20 Feb 2026 | 09:07 PM ✍ Narender Patel journalist https://varahispeednews.in
Share this article: Facebook X Telegram
Scroll to Top