17 వ వార్డు కౌన్సిలర్ రేసులో టి.ఆనంద్

17 వ వార్డు కౌన్సిలర్ రేసులో టి.ఆనంద్

వికారాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో వికారాబాద్ పట్టణంలోని 17వ వార్డు నుంచి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నానని టి.ఆనంద్ ఒక ప్రకటనలో తెలిపారు. వార్డు ప్రజలు ఆశీర్వదించి ఒక అవకాశం కల్పిస్తే, 17వ వార్డు(రాజీవ్ నగర్,మిషన్ కాంపౌండ్,మధు కాలనీ,అనంతగిరి,మేఘన టౌన్షిప్) రూపురేఖలు మార్చి, అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తానని ఆయన హామీ ఇచ్చారు. కుల, మతాలకు అతీతంగా జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ నేతృత్వంతో పార్టీ నాయకులు,కార్యకర్తలు బలబరిచిన అభ్యర్థిగా బరిలో నిలిచి, ప్రజల విశ్వాసంతో గెలిస్తే నిస్వార్థంగా ప్రజా సేవ చేయడమే నా లక్ష్యమని స్పష్టం చేశారు. 17వ వార్డు ప్రజలు ఎదుర్కొంటున్న మౌలిక వసతులు, పారిశుద్ధ్యం, తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ, మహిళలు–యువత సమస్యలపై పూర్తి అవగాహన ఉందని తెలిపారు. ప్రజలు ఆశీర్వదిస్తే తప్పకుండా విజయం సాధించి, నాయకుడిగా కాదు – సేవకుడిగా ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటానని ధీమా వ్యక్తం చేశారు.పైసల ప్రలోభాలకు, ఒత్తిళ్లకు లొంగకుండా, నిజాయితీగా, పారదర్శకంగా ప్రజా సేవ చేయడానికే పూర్తి సమయం కేటాయిస్తానని ఈ సందర్భంగా టి.ఆనంద్ పేర్కొన్నారు.

🗓 23 Jan 2026 | 11:42 AM ✍ Narender Patel journalist https://varahispeednews.in
Share this article: Facebook X Telegram
Scroll to Top