వీడిన మిస్టరీ ! !గుల్బర్గా పోలీసుల అదుపులో.. యాలాల చైన్ స్నాచింగ్ ముఠా

వీడిన మిస్టరీ !..గుల్బర్గా పోలీసుల అదుపులో..
యాలాల చైన్ స్నాచింగ్ ముఠా

7గురు నిందితులు 2 బైక్ లు కారు స్వాధీనం

48 గంటల్లో కేసును చేదించిన  ఎస్సై విట్టల్ రెడ్డి టీం

ఈనెల 21న వికారాబాద్ జిల్లా యాలాల పోలీస్ స్టేషన్ పరిధిలోని విశ్వనాధ్ పూర్ వద్ద జరిగిన చైన్ స్నాచింగ్ ఘటనలో పాల్గొన్న దొంగల ముఠాని కర్ణాటక రాష్ట్రం గుల్బర్గా పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యాలాల ఘటన తర్వాత నిందితులను పట్టుకునేందుకు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు యాలాల ఎస్సై విఠల్ రెడ్డి ఆధ్వర్యంలో 4 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయగా 48 గంటల వ్యవధిలో బీదర్, గుల్బర్గా ప్రాంతంలో నిందితులను పట్టుకోవడంలో తీవ్రంగా శ్రమించిన విట్టల్ రెడ్డి టీం
గుల్బర్గా పోలీసుల సహకారంతో ఏడుగురు నిందితులను పట్టుకోవడం జరిగింది.వీరి నుండి రెండు బైకులు ఒక కారు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై విట్టల్ రెడ్డి తెలిపారు. ఏడుగురు నిందితులను స్థానిక కోర్టు లో హాజరుపరిచి వారిని తాండూరు తీసుకొస్తున్నట్లు యాలాల ఎస్సై విట్టల్ రెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఈ ముఠా యాలాలతోపాటు మహబూబ్నగర్ జిల్లాలో కూడా రెండు ఘటనకు పాల్పడినట్లు కర్ణాటక పోలీసుల విచారణలో తేలింది. గుల్బర్గా పోలీసుల ద్వారా నిందితులను అదుపులోకి తీసుకున్న వారి నుండి దొంగ సొత్తును రికవరీ చేయడంలో గుల్బర్గా పోలీసులు తమకు సహకరించలేదని ఎస్సై విట్టల్ రెడ్డి పేర్కొన్నారు.

ఎస్ఐ విట్టల్ రెడ్డి

🗓 24 Jan 2026 | 09:21 AM ✍ Narender Patel journalist https://varahispeednews.in
Share this article: Facebook X Telegram
Scroll to Top