వికారాబాద్ బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయదగ్గర స్కూటీ, లారీ ఢీ.. ఓ బాలుడు మృతి..

వికారాబాద్ పట్టణంలోని బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయం సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో బైక్ను లారీ ఢీకొనడంతో ఓ బాలుడు దుర్మరణం పాలయ్యాడు. ఈ ఘటన స్థానికులను తీవ్ర విషాదంలోకి నెట్టింది.బుగ్గ రామేశ్వరం వద్ద ఉన్న ప్రమాదకర మలుపు వల్ల గతంలో కూడా ఎన్నో రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయినప్పటికీ, ఆ ప్రమాదకర టర్నింగ్ను సరిచేయడంలో సంబంధిత అధికారులు ఇప్పటికీ నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రమాద స్థలాలను గుర్తిస్తామని అధికారులు మాటలకే పరిమితం అవుతున్నారని, గుర్తించినప్పటికీ తగిన భద్రతా చర్యలు తీసుకోకపోవడమే ఇలాంటి విషాద ఘటనలకు కారణమవుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు.ఇకనైనా అధికారులు స్పందించి, ప్రమాదకరమైన బుగ్గ రామేశ్వరం మలుపును వెంటనే సురక్షితంగా మార్చి, మరిన్ని ప్రాణ నష్టాలను నివారించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
స్కూటీ, లారీ ఢీ.. ఓ బాలుడు మృతి..