మాయ మాటలతో బంగారు పుస్తెలతాడు చోరీ.నిందితురాలు అరెస్ట్

తాండూరు, ఆగస్టు 2: తాండూరు పట్టణంలోని మార్వాడి బజార్‌లో మహిళను మాయ మాటలతో నమ్మించి మూడు తులాల బంగారు పుస్తెలతాడును అపహరించిన నిందితురాలిని తాండూరు పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె వద్ద నుంచి చోరీకి గురైన మూడు తులాల బంగారు పుస్తెలతాడును స్వాధీనం చేసుకున్నారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గత నెల జూలై 21, 2026న మార్వాడి బజార్‌లో ఓ మహిళ వద్దకు వెళ్లిన నిందితురాలు “మీ పుస్తెలతాడు డిజైన్ చాలా బాగుంది.. మా తమ్ముడి పెళ్లిలో కూడా ఇలాంటి డిజైన్ చేయిస్తాం. ఒకసారి దగ్గరగా చూపించండి” అంటూ బాధితురాలిని నమ్మించింది. బాధితురాలు పుస్తెలతాడును చూపించిన సమయంలో చాకచక్యంగా దానిని అపహరించి అక్కడి నుంచి పరారైంది.
బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన తాండూరు పట్టణ పోలీసులు సీసీటీవీ ఫుటేజ్, సాంకేతిక ఆధారాల సహాయంతో దర్యాప్తు చేపట్టి నిందితురాలు నీరటి స్వరూపను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ఆమె నేరాన్ని అంగీకరించడంతో, ఆమె వద్ద నుంచి మూడు తులాల బంగారు పుస్తెలతాడును స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేశారు.ఈ సందర్భంగా పోలీసులు ప్రజలకు సూచిస్తూ.. అపరిచితుల మాటలను నమ్మి బంగారు ఆభరణాలను చూపించడం లేదా చేతికి ఇవ్వడం వంటి చర్యలకు దూరంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారంఅందించాలని విజ్ఞప్తి చేశారు.

మాయ మాటలతో బంగారు పుస్తెలతాడు చోరీ.. నిందితురాలు అరెస్ట్
మాయ మాటలతో బంగారు పుస్తెలతాడు చోరీ.నిందితురాలు అరెస్ట్
తాండూరు, ఆగస్టు 2: తాండూరు పట్టణంలోని మార్వాడి బజార్‌లో మహిళను మాయ మాటలతో నమ్మించి మూడు తులాల బంగారు పుస్తెలతాడును అపహరించిన నిందితురాలిని తాండూరు పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె వద్ద నుంచి చోరీకి గురైన మూడు తులాల బంగారు పుస్తెలతాడును స్వాధీనం చేసుకున్నారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గత నెల జూలై 21, 2026న మార్వాడి బజార్‌లో ఓ మహిళ వద్దకు వెళ్లిన నిందితురాలు "మీ పుస్తెలతాడు డిజైన్ చాలా బాగుంది.. మా తమ్ముడి పెళ్లిలో కూడా ఇలాంటి డిజైన్ చేయిస్తాం. ఒకసారి దగ్గరగా చూపించండి" అంటూ బాధితురాలిని నమ్మించింది. బాధితురాలు పుస్తెలతాడును చూపించిన సమయంలో చాకచక్యంగా దానిని అపహరించి అక్కడి నుంచి పరారైంది.

Oplus_16908288