సమాచార హక్కు చట్టంపై అధికారులు అవగాహన కలిగి ఉండాలి 

సమాచార హక్కు చట్టంపై పౌర సంబంధాల అధికారులు, సహాయ పౌర సంబంధాల అధికారులు అవగాహన కలిగి ఉండాలని జిల్లా రెవెన్యూ అధికారి లోకేశ్వర్ రావు అన్నారు. సమాచార హక్కు చట్టంపై అధికారులకు నిర్వహించిన 2 రోజుల శిక్షణ ముగింపు కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం ద్వారా అధికార యంత్రాంగంలో పారదర్శకత, జవాబుదారితనం ఉంటుందని, జిల్లా అధికార యంత్రాంగం అదుపులో ఉన్న సమాచారాన్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు. సమగ్ర విధి నిర్వహణ, అవినీతి నియంత్రణ సమాచార హక్కు చట్టం ద్వారా సాధ్యమవుతుందని తెలిపారు. అర్జీదారుడు కోరిన సమాచారాన్ని నిర్ణీత గడువులోగా అందించాలని, సమాచార హక్కు చట్టం సామాన్యుడి హక్కు అని తెలిపారు.

🗓 22 Jan 2026 | 12:24 AM ✍ Narender Patel journalist https://varahispeednews.in
Share this article: Facebook X Telegram
Scroll to Top