గురుకులలో విద్యార్థుల ప్రవేశాలకుదరఖాస్తులకు అవకాశం
టీజీ సెట్ దరఖాస్తు గడువు పొడిగింపు.

గురుకులలో విద్యార్థుల ప్రవేశాలకు దరఖాస్తులకు అవకాశం
గురుకులలో విద్యార్థుల ప్రవేశాలకుదరఖాస్తులకు అవకాశం
టీజీ సెట్ దరఖాస్తు గడువు పొడిగింపు.
రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, సాధారణ గురుకులాలలో ఐదోతరగతి ప్రవేశాలతో పాటు 6, 7, 8, 9 తరగతులలో ఖాళీగా ఉన్న (బ్యాక్‌లాగ్ సీట్ల) భర్తీకి ప్రవేశపరీక్ష పరీక్ష నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇట్టి ప్రవేశ పరీక్ష విధానం టీజీసెట్-2026 ప్రకారం అర్హత కలిగిన విద్యార్థుల నుండి దరఖాస్తు స్వీకరించడం కోసం ఈ నెల 25 వరకు పొడిగించినట్లు గురుకుల సెట్ చీఫ్ కన్వీనర్, ఎస్సీ గురుకుల సొసైటీ కార్యదర్శి కృష్ణ ఆదిత్య ఒక ప్రకటన విడుదల చేశారు . ఇప్పటివరకు 1.44 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తులు సమర్పించారని చెప్పారు. అభ్యర్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు మరింత గడువు పెంపు నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇదివరకు సమర్పించిన దరఖాస్తుల్లో కూడ ఏవిధమైన సవరణలు ఉన్న ఈ నెల జనవరి 25 సాయంత్రం 5 గంటల వరకు ఎడిట్ ఆప్షన్ కూడ అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. గురుకుల సెట్ ప్రవేశపరీక్ష దరఖాస్తు గడువు పొడిగించినందున, మరింత మంది విద్యార్థులు దరఖాస్తు చేసేలా అవకాశం కల్పించేందుకు రాష్ట్ర ఎస్సీ గురుకుల సొసైటీ అధికారులు ప్రకటన విడుదల చేశారు. ఇట్టి అంశంపై ఆయా పాఠశాలల ప్రిన్సిపల్స్ క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని గురుకులాల సొసైటీ అధికారి కృష్ణ ఆదిత్య ఆదేశించారు.
