ప్రభుత్వ పథకాలను లబ్ధి చేకూర్చాలి
జిల్లా కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్ లో సెర్ఫ్ సీఈవో దివ్యా దేవరాజన్…
తెలంగాణ ఇన్ క్లూజివ్ లైవ్లీవుడ్ ప్రోగ్రామ్ కింద వికారాబాద్ జిల్లాలో ఎంపిక చేసిన కొడంగల్ మండలంలో గుర్తించిన 1204 కడు నిరుపేద కుటుంబాలకు ఇప్పటి వరకు అందని ప్రభుత్వ సంక్షేమ పథకాలను లబ్ధి చేకూర్చాలని సెర్ఫ్ సీ.ఈ.వో దివ్య తెలిపారు. లైవ్లీ వుడ్ ప్రోగ్రామ్ కు సంబంధించిన నారాయణపేట వికారాబాద్ జిల్లాల కలెక్టర్ల తో సెర్ఫ్ సీ.ఈ.వో హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలోనీ కొడంగల్ మండలంలో 1204 నిరుపేద కుటుంబాలలో ఇంకా కొందరికి ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు లేవని వారికి ఆయా పథకాలను అమలు చేయాలని సీఈవో సూచించారు….
వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాలు నుండి పాల్గొన్న జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ.. కొడంగల్ మండలంలో 18 గ్రామాల నుండి ఎంపిక చేసిన నిరుపేద కుటుంబ సభ్యులకు అవసరమైన పథకాలన్నింటినీ అమలు చేయిస్తామని సీ ఈ వో కు తెలిపారు. సత్వరం సంక్షేమ పథకాల అమలుకు తగిన చర్యలు తీసుకునేలా సంబంధిత జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. మండలంలోని ఆయా శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేసి నిరుపేద కుటుంబాలకు భరోసా కల్పించేలా చూస్తామన్నారు. సేర్ఫ్ కు సంబంధించిన ఇతర కార్యక్రమాల అమలు పై వీసీ అనంతరం కలెక్టర్ అధికారులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సుధీర్, డిఆర్డిఓ శ్రీనివాస్, నర్సింహులు,కో ఆర్డినేటర్ రవి,ఇ డి ఎం మహమ్మద్, తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ పథకాలను లబ్ధి చేకూర్చాలి
ప్రభుత్వ పథకాలను లబ్ధి చేకూర్చాలి
జిల్లా కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్ లో సెర్ఫ్ సీఈవో దివ్యా దేవరాజన్...
తెలంగాణ ఇన్ క్లూజివ్ లైవ్లీవుడ్ ప్రోగ్రామ్ కింద వికారాబాద్ జిల్లాలో ఎంపిక చేసిన కొడంగల్ మండలంలో గుర్తించిన 1204 కడు నిరుపేద కుటుంబాలకు ఇప్పటి వరకు అందని ప్రభుత్వ సంక్షేమ పథకాలను లబ్ధి చేకూర్చాలని సెర్ఫ్ సీ.ఈ.వో దివ్య తెలిపారు. లైవ్లీ వుడ్ ప్రోగ్రామ్ కు సంబంధించిన నారాయణపేట వికారాబాద్ జిల్లాల కలెక్టర్ల తో సెర్ఫ్ సీ.ఈ.వో హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలోనీ కొడంగల్ మండలంలో 1204 నిరుపేద కుటుంబాలలో ఇంకా కొందరికి ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు లేవని వారికి ఆయా పథకాలను అమలు చేయాలని సీఈవో సూచించారు....